హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. డీజీపీ ఆఫీసు, అన్ని పోలీసు విభాగాలు, జిల్లా పోలీసు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. డీజీపీ కార్యాలయంలో ఏడీజీ (పర్సనల్) అనిల్ కుమార్ జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో.. రాష్ట్ర అధికారులకు కేంద్రం ప్రకటించిన పతకాలను సీఎం రేవంత్‌రెడ్డి బహుకరించారు. టీజీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాన్ని జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు బహుకరించారు. మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ పతకాన్ని హైదరాబాద్ జాయింట్ సీపీ (అడ్మిన్) పరిమళ హనా నూతన్, గ్యాలెంట్రీ మెడల్‌ను ఖమ్మం సీపీ సునిల్‌దత్ అందున్నారు.
పతకాలు అందుకున్న అధికారులు
ఎంఎస్ఎం -గణతంత్ర దినోత్సవం – 2024
l వెంకటేశ్వర్లు, ఎస్పీ (ఎన్సీ), డిప్యూటీ డైరెక్టర్, పోలీస్ అకాడమీ
l నరుకుల త్రినాథ్, కమాండెంట్, ఎస్పీఎఫ్, హైదరాబాద్
l చంద్రయ్య, అడిషన్ ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా
l కొకు వీరయ్య, అడిషనల్ కమాండెంట్, 12వ బెటాలియన్, టీజీఎస్పీ
l పింగళి నరేశ్‌రెడ్డి, ఏసీపీ, బాలానగర్, సైబరాబాద్
l శ్రీరాముల మోహన్‌కుమార్, ఏసీపీ, ట్రాఫిక్ సెంట్రల్ జోన్, హైదరాబాద్
l సురేందర్‌రెడ్డి (రిటైర్డ్), ఎస్ఐ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్
l జయచంద్ర నాయుడు, ఎస్ఐ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్
l వెంకటరెడ్డి (రిటైర్డ్), ఏఆర్ఎస్ఐ-75, 7వ బెటాలియన్, డిచ్పల్లి
l ఏసుపాదం (రిటైర్డ్), ఏఆర్ఎస్ఐ-375, 4వ బెటాలియన్, వరంగల్
l జంగయ్య (రిటైర్డ్), హెడ్ కానిస్టేబుల్-344, పీటీఓ (డ్రైవర్), హైదరాబాద్
గ్యాలెంట్రీ మెడల్ -స్వాతంత్య్ర దినోత్సవం- 2024