హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేటీఆర్, గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఆయా జిల్లా కలెక్టర్లు, క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.