Obesity | ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న స్థూలకాయుల సంఖ్య
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శరీరంలో అనవసరపు కొవ్వులకు కారణం అవుతున్నాయి. దాని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల ప్రజలు స్థూలకాయంతో బాధపడుతున్నారు.
- ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న స్థూలకాయుల సంఖ్య
- జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం వెల్లడి
- ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే కారణమని స్పష్ఠీకరణ
Obesity | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శరీరంలో అనవసరపు కొవ్వులకు కారణం అవుతున్నాయి. దాని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల ప్రజలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. తెలుగు రాష్ర్టాలకు చెందిన 10 వేలకు మంది జీవనశైలి, ఆహారపు అలవాట్లను అధ్యయనం చేసిన పరిశోధకులు.. వ్యర్థ కొవ్వులతోనే ఒబెసిటీ పెరుగుతున్నదని తేల్చారు.
హైదరాబాద్‌తోపాటు, కొన్ని పట్టణాలు, ఏపీలోని కొన్ని పట్టణాల్లో క్రాస్ సెక్షనల్ అధ్యయనం ఆధారంగా ఒబెసిటీ తీవ్రతను పరిశీలించారు. ఇందులో 47 శాతం పట్టణాల్లో, 33 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 20 శాతం ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా స్థూలకాయం ఉన్నదని వెల్లడించారు. వీరిలో హైపర్ టెన్షన్, అధిక బరువు, డయాబెటిస్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. పరిశోధకుడు సమరసింహారెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు.
వయోజనుల్లోనే ఎక్కువ
35 ఏండ్లు వయసు పైబడిన వారిలోనే స్థూలకాయం లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలగా, ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణమని వెల్లడించారు. మెజార్టీ ప్రజలకు ఆహార సమతుల్యతపై అవగాహన లేదని, అందుకే అధిక బరువు అని గుర్తించారు. పట్టణాల్లో అధిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఒబెసిటీకి గురవుతున్నారని తేల్చారు. ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర, అధిక ఉప్పు కలిగి ఉండే ఇన్స్టంట్ వంటకాలతో పిల్లలు కూడా బాధితులేనని స్పష్టం చేశారు. ఆహారపు అలవాట్లను మార్చుకొంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

