న్యూఢిల్లీ: ఆకాశ ఎయిర్ విమానంలో అపరిశుభ్ర, అనారోగ్యకర పరిస్థితుల వల్ల తన కాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని ప్రయాణికురాలు జాహ్నవి ఆరోపించారు. ఓ సామాజిక మాధ్యమంలో ఇచ్చిన సుదీర్ఘ పోస్ట్‌లో తనతోపాటు తన మిత్రులు అనుభవించిన ఇబ్బందులను వివరించారు. వాచిపోయిన తన కాళ్ల ఫొటోలను షేర్ చేశారు. దీనిపై ఆమెతో చర్చ జరిపినట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది.