Harish Rao : కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. కొత్త ఏడాది రోజున రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు అన్నారు. నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని హరీశ్ పేర్కొన్నారు.
‘బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియదని వెల్లడైంది. పాపం కీర్తిశేషులైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రిగా మీరు ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారో అని రేవంత్ అబద్ధాలను ఎండగట్టారు ఎమ్మెల్యే. అంతేకాదు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంతు నైజమ’ని ఆయన మండపడ్డారు.
ఈరోజు రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారు.
అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి.
నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారు.
బేసిన్ల… pic.twitter.com/JIMMiWEZsE
— Harish Rao Thanneeru (@BRSHarish) January 1, 2026
‘సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్లో కేసీఆర్‌ను కసబ్ తో పోల్చుతావా? తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి నీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్ తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం. కేసీఆర్‌ను, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా?’ అని రేవంత్‌ను కడిగిపారేశారు హరీశ్.
‘బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడినవు తప్ప, పోలవరం నల్లమలసాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఎందుకు? నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతది. కృష్ణాలో 763 టిఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టిఎంసీలకు ఒప్పుకున్నాడని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్దాలాడినవు. కేసీఆర్ గారు 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాసారు? ఈరోజు నువ్వు కొత్తగా 71శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినవు, ఆనాడే కేసీఆర్ గారు 811 టిఎంసీల్లో 69శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా?’ అని రేవంత్‌పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.