వాంకోవర్: ఎయిరిండియా విమానం ఏఐ186 పైలట్ ఒకరు బ్రెత్ అనలైజర్ టెస్ట్‌లో విఫలమవడంతో కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కెనడాలోని వాంకోవర్ నుంచి ఢిల్లీకి డిసెంబర్ 23న రావాల్సిన విమానానికి పైలట్. వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ సిబ్బంది ఆయన మద్యం సేవించినట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పైలట్‌కు బ్రెత్ అనలైజర్ పరీక్షలు చేశారు.