హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా భిన్నవాతావరణం కొనసాగుతున్నది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి చలి తీవ్రత ఉంటుంది. కిందిస్థాయిల్లో గాలులు వీయడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటున్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పగటి సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల పెరుగుదల కనిపించినట్టు వెల్లడించింది.