హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని హోంగార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ. వెయ్యికి పెంచుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సంబంధించిన కొత్త వాహనాలు, రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్లను ప్రారంభించారు. ఎస్డీఆర్ఎఫ్ నూతన లోగోను ఆవిషరించారు. ట్రా ఫిక్ నియంత్రణ కోసం తాతాలిక పద్ధతిలో ఎంపిక చేసిన ట్రాన్స్జెండర్లకు ఎ న్రోల్మెంట్ పత్రాలను అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డుల దినభత్యాన్ని పెంచడంతో పాటు వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.200కు పెంచుతున్నట్టు ప్రకటించారు. మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. వీటిని జనవరి నుంచి అమలు చేస్తామని తెలిపారు.
పెద్దపల్లి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోదావరిఖనికి చెందిన న్యాయవాది పులిపాక రాజ్‌కుమార్ పా ర్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్వతం త్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, తన నామినేషన్ చెల్లదంటూ అకారణంగా తిరసరించారని ఆరోపిస్తూ రిటర్నింగ్ అధికారి, ఎంపీ వంశీకృష్ణ, ఎన్నికల సంఘాన్ని బాధ్యులను చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.