TS Council |పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలి : ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత | పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ : పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. పట్ణణ స్థానిక సంస్థలపై మంగళవారం ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ క్షేత్ర స్థాయిలో విజయవంతంగా చేపడుతున్న 3,618 మంది కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లుకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరారు.
రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు కోటి 44 లక్షల జనాభా ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థలు ప్రగతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఏడాది రూ.2,622 కోట్లను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అదే విధంగా అర్బన్ లోకల్ బాడీల్లో సీసీ చార్జీలను రెగ్యులర్ గా కట్టుకోవడం, సానిటేషన్ వర్కర్లకు జీతాలు రెగ్యులర్ గా ఇవ్వడం, దాదాపు 2,300 కొత్త సానిటేషన్ వాహనాలను కొనుగోలు చేయడం, 38 లక్షల చెత్త బుట్టలను ఇంటింటికీ పంచడం, డంప్ యార్డులను ఏర్పాటు చేసుకోవడం, సీవరేజ్, మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
పబ్లిక్ టాయిలెట్స్ ను విరివిగా నిర్మించడం, వైకుంఠధామాలు, ఎల్ఈడీ వీధి దీపాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, జంతువుల సంరక్షణ కేంద్రాలు, ఓపెన్ జిమ్ లను సైతం ఏర్పాటు చేశారన్నారు.
వీటితో పాటు వీధి వ్యాపారులకు సైతం మంచి సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక కార్యక్రమాలు, పట్టణ హరిత హారంలో భాగంగా, నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, మల్టి లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు.
మున్సిపల్ బడ్జెట్ లో 10% గ్రీన్ బడ్జెట్ గా కేటాయించి, పట్టణాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

