మహబూబాబాద్ : నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దవంగర మండలం, రాజమాన్ సింగ్ తండాకు చెందిన గుగులోతు సెత్రం, గుగులోతు సురేష్ భూక్యా బాలకృష్ణ, గంట్లకుంట గ్రామానికి చెందిన గుంటల మల్లయ్య, ముక్కాపుల వీరసోములు, అనిత, బత్తుల సోమయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీను భారీ మెజార్టీ తో గెలిపిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.