జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కారెక్కతున్నారు. తాజాగా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, దేవరుప్పుల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మన్నురు హరీశ్ ఆధ్వర్యంలో, నల్లకుంట తండాకు చెందిన కాంగ్రెస్ నేత బనోత్ సుందర్, వార్డు మెంబర్ అజ్మీరా నరసింహ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రిగులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అలాగే దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. రజక సంఘం అధ్యక్షులు మడిపల్లి శేఖర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిమంత్రి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.