హైదరాబాద్, అక్టోబర్ 3 : బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సోమవారం బీఅర్ఎస్ పార్టీ లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని, బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్నాల రవి, కోతి ప్రవీణ్ గౌడ్, గూడూరు వెంకటేశ్వర్లు, బీసు వెంకటేశ్వర్లు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.