Minister Errabelli | కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు.
మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు. తాజాగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న హనుమాండ్ల ఝాన్సీ సొంత గ్రామం.. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారంతా పాలకుర్తిలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో మంగళవారం గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నా వారి సొంత గ్రామం నుంచే అనేకమంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటమే ఇందుకు నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారందరికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయాలని వారికి సూచించారు.
పార్టీలో చేరిన వారిలో ఎద్దు మల్లయ్య, మంచ భిక్షం, గజ్జి యాకయ్య, గాజు ఉప్పలయ్య, ఎద్దు అయిలయ్య, ఎద్దు వెంకన్న, ఎద్దు వెంకన్న (టైగర్), చెవుల వెంకన్న, చెవుల రమేష్, చెవుల సురేష్, మంచ శీను, మంచ రాములు, మంచ వెంకన్న, ఎద్దు కొమురయ్య, జక్కుల రాజమల్లు, ఎద్దుల లింగరాజు, జక్కుల వెంకన్న, గజ్జి నరసయ్య, గజ్జి అరువయ్య, మంచ శ్రీను, సంపెట్ట సూరి, నక్క యాదగిరి, నక్క మహేందర్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

