హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండా ధర్మగడ్డ తండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన భూక్యా శ్రీకాంత్, మూడ్ శంకర్ అధ్వర్యంలో సుమారు 50 మంది, తొర్రూరు మున్సిపాలిటీ నుంచి టీడీపీ పార్టీకి చెందిన దేవికతో 20 మంది కార్యకర్తలతో జాటోత్ ఇందిర అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.