శివ్వంపేట, ఆగస్టు 23 : అంగన్వాడీ కేంద్రంలోని ఎలుకపడిన నీళ్లను చిన్నారులు తాగిన ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం రత్నాపూర్‌లోని అంగన్వాడీ కేంద్రానికి శనివారం వచ్చిన పదిమంచి చిన్నారులకు అంగన్వాడీ టీచర్ నవీన, హెల్పర్ రాజమణి భోజనం వడ్డించారు. తిన్న తర్వాత అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను తాగారు. అక్కడకు వచ్చిన ఓ చిన్నారి తల్లి బిందెలోని ఎలుకను గమనించింది. ఆ వెంటనే అంగన్వాడీ టీచర్‌కు తెలిపింది. అప్పటికే చిన్నారులు ఎలుకపడిన నీటిని తాగేశారు. దీంతో వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్‌కు మె మోలు జారీ చేసినట్టు సీడీపీవో హేమభార్గవి నట్టు వెల్లడించారు.