హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ) : మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌పై ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వం అవాకులు, చవాకులు మాని చేపపిల్లల పంపిణీపై దృష్టిపెట్టాలని సూచించారు. లేకుంటే మత్స్యకారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. నీలి విప్లవానికి నాందిపలికి నిరుపేద మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి పాలనలో రూ. 2, 431 కోట్లు ఉన్న మత్స్యకారుల ఆదాయాన్ని రూ. 6, 514 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. ‘ఇది నేను చెబుతున్నది కాదు..సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్-2024’ నివేదికలో ఉన్నదని వివరించారు.