కరీమాబాద్, అక్టోబర్ 11 : మంత్రి కొండా సురేఖ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఓ సినీ కుటుంబ వ్యక్తిగత విషయాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చకెక్కిన ఆమె.. తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై నోరుపారేసుకున్నారు. ‘ప్రభుత్వ విద్యాలయా ల్లో పనిచేసే టీచర్లకు వారి స్కిల్స్‌పై నమ్మకం లేకనే వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పం పుతున్నారు కావచ్చు.. ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను ఎందుకు ప్రభుత్వ బడుల్లో చేర్పించరో అ ర్థం కాదు.. ప్రభుత్వ విద్యాసంస్థ ల్లో పనిచేస్తున్న టీచర్లే వారి పిల్లల ను సర్కారు బడుల్లో చేర్పించక పోతే ఇతరులకు ఎలా నమ్మకం కలుగుతుంది?’ అని వ్యాఖ్యానించారు. శుక్ర వారం వరంగల్ ఉర్సు రంగలీలా మైదా నంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాల భవన శంకుస్థాపన సందర్భం గా మంత్రి సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో చదివిన వారు ఎంతో గొప్పస్థానాల్లో ఉన్నారని చెప్పారు. వారిని చూస్తే గురువులు గర్వంగా ఫీలవుతారని అన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో కోటాను సైతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని గుర్తుచేశారు. గతంలో ఎంపీలకు అవకాశం ఇచ్చేదని, ప్రస్తుతం ఆ కోటాను వాటిని తీసేసిందని చెప్పారు. ప్రభుత్వం అన్ని వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.