కరీమాబాద్ డిసెంబర్ 22 : రోడ్డుపై(Road) ఉన్న గుంతను పూడ్చాలని కోరుతూ ప్రజలు పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన ఆటో డ్రైవర్లు(Auto drivers) తామే నడుం బిగించారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రధాన రహదారి శాఖ రాసి కుంట వద్ద స్మార్ట్ రోడ్ నిర్మాణం అసంపూర్తిగా వేశారు. దీంతో రోడ్డు ఎగుడు దిగుడుగా మారింది వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఆటో డ్రైవర్లు తమ సొంత డబ్బులతో రోడ్డుకు మరమ్మతులను చేపట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు పనులు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కనీసం మరమ్మతులు కూడా చేయలేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.