Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని : మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
వనపర్తి : తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో నిర్వహించిన బీఆర్ఎస్(Brs) ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏ పథకం అమలుచేసినా ప్రజలకు భరోసానిచ్చి ధైర్యం నింపడం కోసమేనని అన్నారు.తెలంగాణ వస్తే ఏమొచ్చిందో గుర్తుచేసేందుకే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకలికేకల నుంచి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని అన్నారు.సంక్షేమ, అభివృద్ధి(Development and welfare) పథకాలతో ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేశామని వెల్లడించారు.తెలంగాణ వ్యవసాయం దేశానికి తలమానికం అయిందని పేర్కొన్నారు.
ఆసరా(Aasara)తో అవ్వ, తాతలకు, రైతుబంధు, రైతుబీమాతో రైతాంగానికి, కల్యాణలక్ష్మి(KalyanaLaxmi) తో ఆడబిడ్డలకు, కేసీఆర్ కిట్(KCR kit), అమ్మవడితో గర్భిణులకు, సన్నబియ్యం అన్నం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారని వివరించారు.తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనడానికి చేతగాక కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు.
కేసీఆర్(KCR)ను ప్రతిరోజూ తిడుతూ విపక్షాలు ఓట్లేయాలని అడుగుతున్నారు . కానీ కేసీఆర్ కంటే ఎక్కువగా ఏం చేస్తారో ప్రతిపక్షాలు చెప్పడం లేదని తెలిపారు. కేసీఆర్ సేవలు దేశానికి, రాష్ట్రానికి అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

