హైదరాబాద్ : గంజాయి(Cannabis) రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి (Sangareddy )జిల్లా కొల్లూరులో(Kolluru) 32 కేజీల గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు(SOT Police) స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డికు చెందిన బానోతు లక్ష్మణ్ అనే యువకుడు ఏపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌పై ఎన్డీపీఎస్ యాక్టు( (NDPS)) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.