కొత్తగూడెం క్రైం, మార్చి 27: ఓ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ రాంబాబు జిల్లా కోర్టు విధులు నిర్వహిస్తున్నాడు. అశ్వాపురం మండ లం ఎలకలగూడేనికి చెందిన బురక జంపన్న 2021లో ఓ వ్యక్తికి చెందిన వాహనాన్ని లాక్కురావడంతో అతను అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో జంపన్నపై 384, 306 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.
ఈ కేసు కొత్తగూడెం జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో జంప న్న ఆ కేసును కొట్టివేయించడం కోసం కానిస్టేబుల్ రాం బాబును ఆశ్రయించాడు. దీనికి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయగా, జంపన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు కొత్తగూడెం బస్టాం డు వద్ద కానిస్టేబుల్ రాంబాబుకు రూ.10వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీ నం చేసుకొని, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో డీఎస్పీ సూర్యనారాయణ, ఖమ్మం ఏసీబీ ఇన్స్పెక్టర్లు సీహెచ్ బాలకృష్ణ, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.