కానుకలతో మభ్యపెట్టలేరు

- బీజేపీవి చిల్లర రాజకీయాలు
- మా మద్దతు టీఆర్ఎస్కే
- స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు
- ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన
జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళితులు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని గండ్రపల్లిలోని దళితులు బీజేపీ నేత ఈటల రాజేందర్ పంపిణీ చేసిన గడియారాలను రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి దళితుల అభ్యున్నతికి ఏ ప్రభుత్వం, పాలకుడు ఏమీ చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనుండటంతో బతుకులు మారుతాయని ఆనందం వ్యక్తంచేశారు. కాగా, తమ ఓట్లను దండుకునేందుకు బీజేపీ గడియారాలు, ఇతర తాయిలాలు ఇచ్చుకుంటూ చిల్లర రాజకీయాలు చే స్తున్నదని ఆరోపించారు. ఇలాంటివి ఏమా త్రం పని చేయవని, తమ మద్దతు పూర్తిగా సీఎం కేసీఆర్కే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈటల కానుకలకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అంతకుముందు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల, జేఏసీ సంఘాల నాయకుడు బత్తుల పాండు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- gifts
- huzurabad
- manipulation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

