కవాడిగూడ, ఫిబ్రవరి 18 : రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, టీజీఈ జేఏసీ అధ్యక్షుడు మారెం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఆల్ఇండియా ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ రెడ్డి, మెడికల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అధ్యక్షుడు భరత్ సత్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వెంకటేశ్, ఎంఎన్ రెడ్డి, నారాయణరెడ్డి, అశోక్, కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడారు.
తాము అధికారంలోకి వస్తే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యోగ, పెన్షనర్ల ఆరోగ్య భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలని, ఇందుకోసం సమగ్ర ఆరోగ్య పథకాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని దవాఖానల్లో నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. మహాధర్నాలో చంద్రమౌళి, జయరాం, ఎల్ అరుణ, డాక్టర్ స్వరాజ్‌కుమార్, బలరాం పాల్గొన్నారు.