హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులతో రాష్ట్రంలో ఈ ఏడాది చలి తీవ్రత తకువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి ఉకపోతగా ఉంటుందని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున చలితీవ్రత అధికంగా ఉంటూ పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఉదయం పూట మంచు కురుస్తుండటంతో రోడ్లపై వాహనాలు కనిపించటం లేదు. మరోవైపు మధ్య, ఈశాన్య ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం ఆలస్యమైతే ఈ నెల, వచ్చే నెల చలితీవ్రత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాతావరణ మార్పులతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.