హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు గురువారం పూర్తిగా నిష్క్రమించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ఉదయం ప్రవేశించాయని పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఈనెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అనంతరం వాయుగుండం, తుఫానుగా మారే అవకాశాలున్నట్టు చెప్పారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉందని తెలిపారు.