హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి నాయకుల అక్రమ అరె స్టు దుర్మార్గమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి ఎదుట ధర్నా చేసిన విద్యార్థి సం ఘాల జేఏసీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేసి ఓయూ పోలీస్స్టేషన్లో నిర్బంధించడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.