కంది, సెప్టెంబర్ 20 : ఐఐటీ హైదరాబాద్‌లోని 23 మంది అధ్యాపకులు స్టాన్ఫోర్డ్ ప్రపంచంలోని టాప్ 2 శాతం సైంటిస్టుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఐఐటీహెచ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ విడుదల చేసిన 2శాతం శాస్త్రవేత్తల జాబితాలో వీరికి చోటు దక్కడంపై ఐఐటీహెచ్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అభినందించారు. 2023లో చేసిన పరిశోధన (23 ఫ్యాకల్టీ) ఆధారంగా ఈ జాబితాను రెండు వర్గాలుగా విభజించారు. ప్రపంచంలోని ప్రముఖ పరిశోధకులుగా గుర్తింపునిస్తుంది.