Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా బందర్పల్లికి చెందిన అరవింద్ ఇంటికి వెళ్లి ఈ నెల 12న తిరిగి వర్సిటీకి వచ్చాడని అధికారులు తెలిపారు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు.
ఇదే విషయమై అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అధికారులు.. అతడిని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు రాకపోవడంతో విద్యార్థి హాస్టల్లోనే ఉన్నాడు. అయితే తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన తర్వాత అతడు ఉరివేసుకున్నడాని, ఆ తర్వాత అక్కడికి వచ్చిన విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

