కారాబాద్, నవంబర్ 13 : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన వికారాబాద్ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం వరకు ఈ కేసులో భోగమోని సురేశ్ మొదటి నిందితుడు (ఏ1)గా ఉన్నాడని, ఇప్పుడు నరేందర్‌రెడ్డిని ఏ1గా నిర్ధారించి, కోర్టులో హాజరుపర్చామని చెప్పారు. దాడిలో 42 మంది పాల్గొన్నట్టు గుర్తించామని, వారిలో బుధవారం వరకు 21 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వివరించారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.