ఖమ్మం : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆరోపణలు చేస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన వీకెండ్ స్టోరీపై ఆయన స్పందించారు. రెండు టీవీ ఛానెల్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులను వివాదంలోకి లాగవద్దని సూచించారు.
ఆ రెండు ఛానెళ్ల యాజమాన్యాల మధ్య గొడవలు ఉంటే వాళ్లు తలుపులు మూసుకుని కొట్టుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. అంతేతప్ప రాజకీయ నాయకులను ఆ గొడవల్లోకి లాగొద్దని చెప్పారు. తన మంత్రుల మీద తప్పుడు ప్రచారాలు చేసినా, వారిని బదనాం చేసినా బాగుండదని హెచ్చరించారు. అదేవిధంగా ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు’ అని కొనియాడారు.