హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీలను అమలు చేయకు ండా కాంగ్రెస్ యువకుల ఊసురుపోసుకుంటున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని గొల్లవాడలో ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన బండి శ్రవణ్ అనే యు వకుడు కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించాను.
ఒకవైపు 60 వేల ఉద్యోగాలిచ్చామని రేవంత్‌రెడ్డి సరార్ ప్ర చారం చేసుకుంటున్నది. కానీ, కొలువుల కోసం నిరీక్షణలో శ్రవణ్ లాంటి యువకులు అలసిపోయి శాశ్వతంగా దూరమవుతున్నారు. కనీసం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా శ్రవణ్ బతికేవాడేమో’ అని బుధవా రం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు.