Dharani Portal | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతి భూతాన్ని తరిమికొట్టి రైతులకు భరోసా కల్పించిన సంస్కరణలు కాలగర్భంలో కలిసిపోతాయి. ధరణిని ఎత్తేస్తే మళ్లీ భూముల రికార్డుల నిర్వహణ గ్రామస్థాయి, మండలస్థాయి అధికారుల చేతుల్లోకి వెళ్తుంది. భూములు కొత్తగా కొనుగోలు చేసేవారికి చుక్కలు కనిపిస్తాయి. పాస్‌బుక్ పొందాలంటే సవాలక్ష అడ్డంకులు కల్పిస్తారు. కాంగ్రెస్ పాలనలో డబ్బు ఇవ్వకుంటే రైతు దరఖాస్తు చెత్తబుట్టలోకి చేరేది. ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం పెండింగ్ మ్యుటేషన్లకు అవకాశం కల్పిస్తే.. ఏకంగా 1.80 లక్షల దరఖాస్తులు రావడమే నాటి అవినీతికి, అవగాహన లేమికి నిదర్శనం. ఈ సమస్యలన్నింటికీ కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు చెక్ పెట్టాయి.