సీఎం సభకు రాకుంటే 2వేల ఫైన్.!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను ‘సక్సెస్' చేసే క్ర మంలో జిల్లా యంత్రాంగం నిబంధనలు తుంగలో తొకింది.
- ఇందిరమ్మ చీరలు కట్టుకోకుంటే వేటు
- మహిళా సంఘాలపై సెర్ప్జులుం
- లోన్లు, స్కీమ్‌లు రద్దని వార్నింగ్
గణపురం, ఫిబ్రవరి 8 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను ‘సక్సెస్’ చేసే క్ర మంలో జిల్లా యంత్రాంగం నిబంధనలు తుంగలో తొకింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులో నిర్వహించిన బహిరంగ సభకు జన సమీకరణే లక్ష్యంగా పెట్టుకున్న సెర్ప్ అధికారులు తాము ప్రభుత్వ సేవకులమ న్న విషయాన్ని మరిచి అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం చర్చనీయాంశ మైంది. ముఖ్యంగా గణపురం మండల మహిళా సమాఖ్య సభ్యులపై ప్రదర్శించిన జులుం పరాకాష్టకు చేరింది. సభకు జనా న్ని తరలించే బాధ్యతను భుజానికెత్తుకున్న సెర్ప్ అధికారులు.. మహిళా సంఘాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సభకు వచ్చే మహిళ లు తప్పనిసరిగా ఇందిరమ్మ చీరలు ధరిం చి రావాలని, లేకపోతే చర్యలుంటాయని హుకూం జారీ చేశారు. సభకు రాకుంటే ఒకొకరిపై రూ.2వేల జరిమానా వేస్తామ ని, భవిష్యత్‌లో సంఘాలకు వచ్చే బ్యాంకు లోన్లను అడ్డుకుంటామని సీఏలు బహిరంగంగానే హెచ్చరించినట్టు సమాచారం.
ప్ర భుత్వ పథకాలను కూడా రద్దుచేస్తామని బె దిరించడంతో మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు రోజువారీ కూలీ ప నులు మానుకొని సభకు రావాలని ఒత్తిడి చేస్తూనే, భోజన ఖర్చులను కూడా సంఘా ల పొదుపు ఖాతాల నుంచే భరించాలని అ ధికారులు బెదిరించారు. ‘కూలీకి వెళ్లే మమ్మల్ని సభకు రాకుంటే ఫైన్ వేస్తామని, లోన్లు ఆపేస్తామని భయపెట్టారు. చేసేది లేక పని వదులుకొని సభకు వెళ్లాల్సి వచ్చింది’ అని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికారులు పార్టీ ఏజెంట్లు గా మారి వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని స్థానికులు మండిపడుతున్నారు. బలవంతపు జన సమీకరణపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అతిగా ప్రవర్తించిన సెర్ప్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

