హైదరాబాద్: స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొద్దన్నారు. చట్టబద్ధంగా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిందని.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు.
సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి.. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండక పోవచ్చు
తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వకండి
స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి
ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే… pic.twitter.com/y6mjVqBP5S
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025