BRS MLAs : సీఎం రేవంత్ రెడ్డి తన వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలోకి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రవేశపెడుతున్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్‌పై దాడికి పంపించారు. అసెంబ్లీ నడుస్తుండగా స్వయంగా ముఖ్యమంత్రే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీ అధినేతపై దాడికి పంపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులను రేవంత్ రెడ్డి గూండాల్లా ప్రతిపక్ష పార్టీపై ప్రయోగిస్తున్నారని విమర్శంచారు. కాంగ్రెస్ గూండాలను పోలీస్ రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏకంగా 500 మంది గూండాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీస్ ఎస్కార్టుతో కేసీఆర్ ఫామ్ హౌస్‌పైకి ఎలా ఉసిగొల్పుతారని ప్రశ్నించారు. తమ అధినేత కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతదని హెచ్చరించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ అంటే తమ అధినేత నివాసమని, తమ అధినేత నివాసమంటే తమ నివాసమని, తమ సొంత ఇంటికి తాము వెళ్తుంటే అడ్డుకుంటున్న మీరు.. కాంగ్రెస్ గూండాలను మాత్రం పోలీస్ రక్షణతో ఎలా పంపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నంచారు. మా ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు, కాంగ్రెస్ గూండాలను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. ముందుగా వాళ్లను ఆపి, తర్వాత తమను ఆపాలని అంటున్నారు.
కేసీఆర్‌కు ఏమైనా అయితే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తాము
పోలీసు వాళ్ళని గూండాలని ఇచ్చి ఎలా పంపిస్తారు.. గూండాలకి సెక్యూరిటీ ఎలా ఇస్తారు, రేవంత్ రెడ్డిని మేము వదలము
కాంగ్రెస్ రౌడీ ఎమ్మెల్యేలను, 500 మంది గుండాలతో పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి ఎలా పంపించారు
మా ఇంటికి మేము పోతుంటే… https://t.co/TFVc3TqQVe pic.twitter.com/nzfKshcehh
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026