హైదరాబాద్,అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వామప క్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తామ ని చెప్పారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ని ర్వహిస్తున్న ఆరు రోజుల సీపీఎం అఖిలభారత స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు మంగళవా రం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ప్రకాశ్‌కారత్, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎన్నికల కమిషన్ రాజకీయ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను అమలు చేయాలని నిర్ణయించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛ గా ఓటు హకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ స్వతంత్రతను కోల్పోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.