కోర్టు ధికరణ కేసులో ఐఏఎస్ సుల్తానియా హాజరు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణ బకాయిల్లో 30 శాతం చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణ బకాయిల్లో 30 శాతం చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. వీటికి సంబంధించి ఎన్సీసీ లిమిటెడ్కు చెల్లించాల్సిన రూ.180.17 కోట్ల బకాయిల్లో 30 శాతాన్ని ఈ నెల 23లోగా చెల్లిస్తామని తెలిపింది.
బకాయిలను చెల్లించాలన్న గత ఆదేశాలను అమలు చేయలేదంటూ ఎన్సీసీ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్ను జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారించారు. గత ఉత్తర్వుల మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

