ఇద్దరు అధికారులకు జైలు
మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని ఐఏఎస్ అధికారితోపాటు మరో అధికారికి హైకోర్టు జైలు శిక్షను విధించింది.
- ఐఏఎస్ అరవింద్‌కుమార్, మరో అధికారి ప్రసూనాంబకు 2 వారాలపాటు జైలు శిక్ష
- కోర్టు ధికరణ కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని ఐఏఎస్ అధికారితోపాటు మరో అధికారికి హైకోర్టు జైలు శిక్షను విధించింది. సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కోల్పోయిన యజమానికి 2016లో కేటాయించిన 666.67 చదరపు గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేస్తామని పలుమార్లు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్న కోర్టు ధికరణ పిటిషన్లో ఈ ఉత్తర్వులను జారీచేసింది.
గత మధ్యంతర ఉత్తర్వులను మూడు నెలల్లో యజమానికి ప్లాటును రిజిస్ట్రేషన్ చేసివ్వకపోతే ప్రతివాదులైన మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి హెచ్ఎండీఏ కమిషనర్‌గా గతంలో చేసిన అరవింద్ కుమార్, భూసేకరణ అధికారిగా చేసిన మరో అధికారి ప్రసూనాంబకు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో వారం పాటు అదనంగా జైలు జీవితాన్ని గడపాలని షరతు విధించింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. మూసీ నది సుందరీకరణ కోసం భూసేకరణ జరిపినప్పడు ఉప్పల్ భగాయత్‌లో ఎస్ రాంరెడ్డి భూమిని కోల్పోయారు. ఆయనకు కేటాయించిన ప్లాటు రిజిస్టర్ చేయించాలని గత ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. వాదనలనంతరం తాజా తీర్పునిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

