e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News రాజీయే రాచబాట

రాజీయే రాచబాట

 • ఐఏఎంసీకి పుప్పాలగూడలో 5 ఎకరాల స్థలం
 • నానక్‌రాంగూడలో తాత్కాలిక భవనం.. 18న ప్రారంభం
 • మధ్యవర్తిత్వంతోనే కేసుల సత్వర పరిష్కారం
 • దేశంలోని కోర్టుల్లో 4 కోట్ల కేసులు పెండింగ్‌
 • అన్నీ పరిష్కారమయ్యే అవకాశాలు తక్కువ
 • సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ వల్లే సత్వర ఏర్పాటు
 • విశ్వసనీయత ఉన్న ఎవరైనా తీర్పులివ్వొచ్చు
 • ఇందుకు లా డిగ్రీ, కోర్టులు అవసరం లేదు
 • ఐఏఎంసీ సదస్సులో సీజేఐ జస్టిస్‌ రమణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (నమస్తే తెలంగాణ): దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి నాలుగు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిషారం సాధ్యంకాని పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిషారం (ఏడీఆర్‌) మార్గాన్ని ఎంచుకోవటం ఉత్తమం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తకువ సమయంలో కేసులను పరిషరించుకోవడం ద్వారా ధనం ఆదా అవ్వడమేకాకుండా సత్వర న్యాయం లభిస్తుందని తెలిపారు. వివాదాల పరిషారం కోసం కోర్టుకు రావడం చివరి అంకంగా ఉండాలని సూచించారు. హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సన్నాహక సదస్సులో జస్టిస్‌ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేస్తూ జనాభాకు దీటుగా కోర్టుల్లో వసతులు, న్యాయమూర్తుల సంఖ్య పెంచటం కష్టమని తెలిపారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని అన్నారు. న్యాయ సంసరణల్లో భాగంగానే మధ్యవర్తిత్వం, సంప్రదింపుల విధానం వచ్చిందని, వీటి ద్వారా కేసులను రాజీ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్థిక సంసరణల ఫలితంగానే దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని కొనియాడారు.

ఈనెల 18న ప్రారంభం..

ఈ నెల 18న గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్‌ క్యాపిటల్‌లో ఐఏఎంసీ ప్రారంభమవుతుందని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రకటించారు. ఆగస్టు 20న సీఎం కేసీఆర్‌ వద్ద ఐఏఎంసీ ఏర్పాటు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన యుద్ధ ప్రాతిపదికపై స్పందించిన తీరు మరువలేనిదని కొనియాడారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అందించిన సహకారంతో స్వల్ప వ్యవధిలో ఐఏఎంసీ రూపుదాల్చిందని ప్రశంసించారు. ‘ఐఏఎంసీ ప్రతిపాదన చేయగానే సీఎం కేసీఆర్‌ స్పందించిన తీరు ముదావహం. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లుచేసిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యావాదాలు. భూమిని కూడా కేటాయించినట్టు ఈ రోజు సీఎం ప్రకటించడం హర్షణీయం. సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వ చొరవ వల్లే ఇది సాధ్యమైంది’ అని వెల్లడించారు. ఇప్పటి వరకూ కొన్ని దేశాల్లోనే ఐఏఎంసీలు ఉన్నాయని, ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్నదని చెప్పారు. ప్రపంచమంతా ఇప్పుడు మధ్యవర్తిత్వంవైపు మొగ్గుచూపుతున్నదని, తకువ ఖర్చు, తకువ సమయం, ఇరుపక్షాల భాగస్వామ్యంతో పరిషారం వంటి అవకాశాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంలో ఇరుపక్షాలూ గెలుస్తాయని వెల్లడించారు.

హైదరాబాద్‌కు అలంకారం

- Advertisement -

ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయటానికి అనేక కారణాలున్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్‌ ప్రపంచంలోనే మరింత గుర్తింపు పొందేందుకు ఐఏఎంసీ దోహదపడుతుందని అన్నారు. హైదరాబాద్‌ ఐఏఎంసీ సింగపూర్‌, యూకే కేంద్రాల స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వంపై లోతైన అవగాహన ఉన్నవారే హైదరాబాద్‌ కేంద్రంలో ఆర్బిట్రేటర్స్‌గా ఉంటారని, దీంతో హైదరాబాద్‌కు కొత్త ట్రెండ్‌ వస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సెంటర్‌ ఏర్పాటులో సింగపూర్‌, లండన్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్ల ప్రతినిధులు, సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సహకారం కోరితే సానుకూలంగా స్పందించారని తెలిపారు.

హైదరాబాద్‌ ఎంపికకు ఇవే ప్రామాణికం

 • ఫార్మా, బయోటెక్‌, ఏరోనాటికల్‌ పరిశ్రమలు
 • మౌలిక వసతులు, రియల్‌ ఎస్టేట్‌.
 • ఐటీకి అంతర్జాతీయ గుర్తింపు
 • వాణిజ్య, వ్యాపారాలకు అనువైన ప్రదేశం
 • పారిశ్రామికావృద్ధి, అంతర్జాతీయ విమానాశ్రయం
 • అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో హోటల్స్‌
 • వృద్ధిలో అత్యంతవేగంగా దూసుకుపోతున్న నగరం
 • అందరికీ నచ్చే అద్భుతమైన వాతావరణం
 • అందర్నీ అకున చేర్చుకొనే తెలంగాణ సంప్రదాయం.

సీఎం కేసీఆర్‌ది ఉత్తమ సంసారం సీఎం కేసీఆర్‌ చేయి చాలా పెద్దది. ఏం చేసినా ఆర్భాటంతో పెద్దగా చేస్తారు. విద్య నేర్పిన గురువుల ద్వారా కేసీఆర్‌కు ఉన్నత సంసారం అబ్బింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారమే ఈ కేంద్రం
సత్వర ఏర్పాటుకు కారణం

సీజేఐ ఎన్వీ రమణ

నా కల సాకారం అవుతున్నది..

మధ్యవర్తిత్వం ప్రాచీనకాలం నుంచే ఉన్నదని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులుకౌరవుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని, మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాతే మహాభారత యుద్ధం వచ్చిందని చెప్పారు. మన ఇండ్లల్లో వివాదం ఏర్పడితే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సర్దుబాటు చేసే సంప్రదాయం ఇప్పటికీ ఉన్నదని గుర్తుచేశారు. ‘ఆర్బిట్రేషన్‌ (సర్దుబాటు), మీడియేషన్‌ (మధ్యవర్తిత్వం), కన్సల్టేషన్‌ (సంప్రదింపులు) ద్వారా వివాదాల సత్వర పరిషారానికి హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేయడం చరిత్రాత్మకం. తొలుత వ్యక్తిగత ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలనే అనుకున్నాం. జస్టిస్‌ లావు నాగేశ్వరరావును సంప్రదించిన తర్వాత దేశాలకు ఉపయోగపడే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రతిపాదనచేశారు. అదే ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇందులో అడ్‌హాక్‌, సంస్థాగత ఆర్బిట్రేషన్లు ఉంటాయి. కక్షిదారులు ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్గదర్శకాలను జస్టిస్‌ రవీంద్రన్‌ రూపకల్పన చేశారు. కేసుల రాజీకి ఇది వెన్నెముకగా నిలవాలి. ఈ కేంద్రం ఏర్పాటులో మధ్యవర్తిత్వంలో విజ్ఞాన గనిగా ఉన్న జస్టిస్‌ రవీంద్రన్‌ కృషి మాటలతో చెప్పలేను. జస్టిస్‌ కురియన్‌, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, తెలంగాణ తొలి మహిళా సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమాకోహ్లీ సేవలు కొనియాడదగ్గవి. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ నాకల. ఇప్పుడు సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

పీవీ తెచ్చిన సంసరణల ఫలితమే

‘తెలుగు వాడిని.. ఒక నిమిషం తెలుగులో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. సీఎం కేసీఆర్‌ కూడా తెలుగు భాషాభిమాని’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలుగులో చెప్పగానే సభికులు కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తంచేశారు. ‘తెలుగులో మాట్లాడకపోతే తెలుగువారి భోజనంలో పెరుగు లేనట్టుగా ఉంటుంది. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆర్థిక సంసరణలకు శ్రీకారం చుట్టారు. ఆ మహానుభావుడి చర్యల ఫలితంగా ఎన్నో సంసరణలు వచ్చాయి. తెలుగు వ్యక్తి పీసీ రావు కూడా మధ్యవర్తిత్వంపై లా పుస్తకం రాసి ఎంతో కృషిచేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఏ దేశానికి వెళ్లినా కేసు దాఖలైతే లిటిగేషన్‌ ఎంతకాలం పడుతుందనే ప్రశ్న ఎదురవుతున్నది. అందుకే మధ్యవర్తిత్వం ద్వారా కేసుల రాజీకి ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుంది’ అని జస్టిస్‌ రమణ తెలిపారు.

విశ్వసనీయత ఉన్నవాళ్లూ తీర్పు చెప్పవచ్చు. తీర్పులు చెప్పడానికి న్యాయశాస్త్రం చదవాల్సిన పనిలేదని జస్టిస్‌ రమణ అన్నారు. కోటు వేసుకొని హంగామా, హడావుడి అవసరంలేదని, సమాజంలో విశ్వసనీయత ఉన్నవారు తీర్పులు చెప్పవచ్చని పేర్కొన్నారు. ‘సమాజంలో విశ్వసనీయత ఉన్న వ్యక్తులు తీర్పులు చెప్పవచ్చని రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలోనే చెప్పాను. ఇందుకు లా డిగ్రీ, కోర్టులు అవసరంలేదు. హైదరాబాద్‌ ఐఏఎంసీలో తెలుగువారికి సముచిత స్థానం కల్పించాం. సామాన్యులు కూడా సరళమైన పద్ధతిలో తీర్పులు చెప్పవచ్చు. మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు లాంటి అనేకమందికి సమాజంలో గుర్తింపు ఉన్నది. అలాంటివారు మధ్యవర్తిత్వ కేంద్రంలో సభ్యులుగా చేరి సరళమైన పద్ధతుల్లో తీర్పులు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.

హైదరాబాద్‌ కీర్తి ఘనం: జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ

చారిత్రకంగా హైదరాబాద్‌కు ఘనమైన కీర్తి ప్రతిష్ఠలున్నాయని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కరోనా టీకా తయారుచేసి ప్రజల ప్రాణాలు నిలిపేందుకు చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటుచేయాలన్న సీజేఐ జస్టిస్‌ రమణ నిర్ణయం చరిత్రాత్మకం అన్నారు. ఐఏఎంసీకి జీవితకాల ట్రస్టీగా ఉన్న జస్టిస్‌ రవీంద్రన్‌కు జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ పాదాభివందనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు అయ్యేదికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు అన్నారు. వివాదాల పరిష్కారానికి ఇకపై సింగపూర్‌, హాంకాంగ్‌ వెళ్లాల్సిన అవసరంలేదని తెలిపారు. సివిల్‌ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల విచారణలో జాప్యం, పెండింగ్‌వల్ల చాలామంది ఏడీఆర్‌వైపు మొగ్గుచూపుతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ ఐఏఎంసీకి ఎకువ కేసులు వచ్చే అవకాశం ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ అన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డి, అమర్‌చంద్‌ మంగలదాస్‌కు చెందిన తేజస్‌ కార్య, అరిస్టా ఛాంబర్స్‌ ఫౌండర్‌ ప్రమోద్‌ నాయర్‌, తత్వా లీగల్‌ వ్యవస్థాపకుడు శైలేంద్ర కోమటిరెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ జనరల్‌ కౌన్సెల్‌ వివేక్‌ మిట్టల్‌, ట్వంటీ ఎస్సెన్స్‌ సీనియర్‌ న్యాయవాది నకుల్‌ దివాన్‌, న్యాయవాది చిత్ర నారాయణ్‌, సింగపూర్‌కు చెందిన అభినవ్‌ భూషణ్‌ ప్రసంగించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీకే మిశ్రా, ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

20 ఏండ్లలో కానిది.. ఐదునెలల్లోనే సాకారం

ఐఏఎంసీ నిర్మాణానికి 2003లోనే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో ఇది సాకారం కాలేదు. సుప్రీంకోర్టు సేజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్లీ చర్చ మొదలైంది. ఐఏఎంసీకి గతంలో కేటాయించిన భూమి, సెంటర్‌వల్ల కలిగే ప్రయోజనాలపై సీఎం కేసీఆర్‌తో సీజేఐ చర్చించారు. వెంటనే సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌, సెంటర్‌ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షలు నిర్వహించారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం పుప్పాలగూడలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తాత్కాలిక కేంద్రం ఏర్పాటుకు నానక్‌రామ్‌గూడలోని ఫీనిక్స్‌ వీకే టవర్స్‌లో స్థలం కేటాయించి, రూ.10 కోట్ల నిధులు కూడా ఇచ్చారు. వార్షిక నిర్వహణ ఖర్చులకోసం ఏటా రూ.మూడు కోట్ల చొప్పున గ్రాంటు మంజూరు చేశారు. ఆరు నెలలు తిరక్కుండానే తాత్కాలిక భవనంలో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటవుతున్నది. ఈ నెల 18న ప్రారంభించనున్నారు.

సీజేఐకి సీఎం కేసీఆర్‌ సత్కారం

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను పోచంపల్లి శాలువాలతో సీఎం కేసీఆర్‌ సతరించారు. ఐఏఎంసీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జస్టిస్‌ రవీంద్రన్‌ను, ఇతర న్యాయమూర్తులను కూడా సతరించారు. ఐఏఎంసీ లోగోను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిషరించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement