భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే తన యావదాస్తిని అమ్మి అయినా సరే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని పనులూ వదులుకొని గెలిపించుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత నరసింహమూర్తి ప్రకటించారు. ‘యంగ్ లీడర్ కేటీఆర్‌ను కలవడం సంతోషంగా ఉన్నది. తెల్లం వెంకట్రావ్‌ను కట్టపడి గెలిపిస్తే ఆయన మూడు నెలలే పార్టీ మారిండు. నాపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నడు.
కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు, కలెక్టర్ల కోసం మనం పింక్ బుక్ పెట్టాలి. కేసీఆర్ నాకు తండ్రితో సమానం. నా సంపాదన అంతా పార్టీకి ధారాదత్తం చేస్తా. భద్రాచలంలో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తా’ అని స్పష్టంచేశారు. నరసింహమూర్తి భావోద్వేగంతో మాట్లాడిన మాటలపై కేటీఆర్ స్పందించారు. ‘మీ స్ఫూర్తికి, మీ మాటలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు.