నాగర్ కర్నూల్ : పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కోసం, రేపటి గెలుపు కోసం కొట్లాడే కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy )అన్నారు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో పార్టీకీ కార్యకర్తలు అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ ( Nagar kurnool ) జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి అన్ని అనుభవించి అధికారం పోయాక కడుపు మీద తన్ని పోయే నాయకులు అవసరం లేదని వెల్లడించారు. కావాల్సింది . పార్టీ గెలుపు కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి వారిని అక్కున చేర్చుకోవడమే తన లక్ష్యమని అన్నారు.
వలస లీడర్స్ వల్లే పార్టీకి నష్టం జరిగిందని పేర్కొన్నారు. గ్రూపులు కట్టే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చుకుందాం. బాపు కేసీఆర్ ( KCR ) ను మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చడం చంద్రబాబు వల్లే కాలేదు. ఇంకా నీ వల్ల ఏమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ దిమ్మనే ఢిల్లీని గజాగజా వణికించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చి మొండి చేయి చూపిన కాంగ్రెస్కు ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ,రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ , నాగర్ కర్నూల్ నియోజకవర్గ సభ్యత్వం ఇన్చార్జి జహంగీర్ తదితరులు హాజరయ్యారు.