హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్న ప్రజల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు మహిళల పోరాటానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. వారే తనకు స్ఫూర్తి అంటూ రాసుకొచ్చారు. సమక్క సారక్కలు.. మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలని పేర్కొన్నారు. అలుపెరగని పోరాటం చేస్తున్న రుద్రమ్మలన్నారు. మీ స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. మెరుగైన తెలంగాణ కోసం సోదరుడిగా మీ పోరాటానికి అండగా ఉంటానని ట్వీట్ చేశారు.
సమ్మక్కలు, సారక్కలు….
మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలు….
అలుపెరగ పోరాటం చేస్తున్న రుద్రమ్మలు!మీరంతా నా స్పూర్తి!
I salute your spirit and I will be your brother in this fight for a better Telangana!
జై తెలంగాణ ✊🏼 pic.twitter.com/6wiFIHlT2u
— KTR (@KTRBRS) November 28, 2024