సోన్, జూన్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని తెలంగాణ ఉద్యమకారుడు తిరస్కరించాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సామ కిరణ్‌రెడ్డికి కలెక్టర్ పత్రాలు అందజేశారు.
అయితే ఈ ఆర్థిక సాయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శికి లేఖ రాశారు. ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.