నల్లగొండ : నాకు పదవులు అవసరం లేదు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా అని
భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చ జరిగుతున్నది.
వచ్చే మునుగోడు ఉప ఎన్నికలలో స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ ముఖచిత్రంతో చిత్రంతో గెలుస్తామన్నారు. మునుగోడు అభివృధి కోసం ఈ ఉప ఎన్నిక ఎంతో ఉపయోగ పడుతుంది.
మునుగోడు ప్రజలు అధికార పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీ కు అనుకూలంగా తీర్పు ఇస్తే మునుగోడుపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజలు దూర దృష్టితో ఆలోచించి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన పులిపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడంలో మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్ని విధాలుగా మునుగోడు మండలం అభివృధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. బిజినెస్, విద్య ,రియల్ ఎస్టేట్ పరంగ మునుగోడు చాలా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డు శ్రావణి, టీఆర్ఎస్ పార్టీ మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ రఫిక్, పాలకురు నర్సింహ, యువజన నాయకులు జంగిల్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.