సాగునీరు ఇయ్యలేను
రైతులకు సాగునీరు అందించే పరిస్థితుల్లో తాను లేనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి తేటతె ల్లంచేశారు. వరి వేసి ఆగం కావొద్దని, ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, పెసర్లు సాగు చేయాలని సూచించారు.
- వరి వేసి ఆగం కావొద్దు
- ఎమ్మెల్యే కడియం
వేలేరు, జూలై 22 : రైతులకు సాగునీరు అందించే పరిస్థితుల్లో తాను లేనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి తేటతె ల్లంచేశారు. వరి వేసి ఆగం కావొద్దని, ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, పెసర్లు సాగు చేయాలని సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేం ద్రంతోపాటు మద్దెలగూడెంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కడియం హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్దెలగూడెంలో కడియం మాట్లాడుతుండగా.. ఓ రైతు కలుగజేసుకొని తమకు సాగునీరు అందించాలని కోరాడు. స్పందించిన శ్రీహరి.. ప్రస్తు తం సాగునీరు అందించే పరిస్థితుల్లో తాను లేనని, ఈ సీజన్‌కు నీరు రావడం కష్టమేనని తేల్చిచెప్పారు. ‘మీకు నీళ్లు ఇస్తానని హామీ ఇస్తే పొలం వేసుకుంటారు. రెండు నెలల తర్వాత ఎండిపోతే శాపనార్థాలు పెడుతారు’ అని వ్యాఖ్యానించారు.
సమావేశానికి రాలేదని 500 ఫైన్
వేలేరులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహిస్తున్న సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు తప్పకరా వాలని, లేదంటే రూ.500 చొప్పున జరిమానా విధిస్తామని సీఏ హెచ్చరికల ఆడియో వాట్సాప్ గ్రూపులో వైరల్ అయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

