హైదరాబాద్ : ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివరిస్తూ యువకుడు రెమ్డెసివిర్ డ్రగ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. దయచేసి ఆంధ్రా ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరాడు.
దీనిపై తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ తన స్నేహితుడు, ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ మీకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ బాధితులకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించారు. దీనిపై బాధితుడు స్పందిస్తూ ఇరు రాష్ట్రాల మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. తెలంగాణ, ఆంధ్రా బేదం భావం లేకుండా ఆపదలో ఉన్నా అంటే చాలు నేనున్నా అని ధైర్యం చెప్పి సహాయం చేసేవాడే మా కేటీఆర్ అన్న అని నెటిజన్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.
I am sure my friend @MekapatiGoutham can help https://t.co/So93RG08zt
— KTR (@KTRTRS) April 26, 2021