హైదరాబాద్ : వాళ్లంతా వందల ఎకరాలను కబ్జా చేసిన భూస్వాములు కాదు, అనుమతులు లేకుండా విల్లాలు కట్టుకున్న శ్రీమంతులు అంతకంటే కాదు. పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వలసొచ్చిన బడుగు జీవులు. కాయకష్టం చేసి, పైసా పైసా కూడబెట్టుకొని తలదాచుకునేందుకు కొంత జాగతీసుకొని ఎన్నో ఏండ్ల కింద ఇండ్లు కట్టుకున్న అభాగ్యులు వాళ్లు.
నాడు వారి ఇండ్లకు అనుముతులు ఇచ్చిన అధికారులే నేడు అవి అక్రమం అని కూల్చివేస్తుంటే ఆ బడగు జీవులు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వ కుండా రోడ్డున పడేయడంతో భారీ వర్షంలో పిల్లలు, వృద్ధులు, మహిళలు పరదాలు, రేకులు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపడుకుంటున్నారు. ఈ హృదయవిదాకర సంఘటన హైరదాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలో మరోసారి హైడ్రా(HYDRAA) కూల్చి వేతలు మొదలయ్యాయి. హైడ్రా అధికారులు అమానవీయ చర్యలతో ఎన్నో కుటుంబాలు వీధిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఎలాంటి హెచ్చరి కలు లేకుండా, కనీసం సమాన్లు తీసుకునే అవకాశం లేకుండా ఇండ్లు కూల్చి వేస్తున్నారు. మాదాపూర్ (Madapur) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలపై పేదలు (Hydra victims)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సున్నం చెరువు వద్ద పేదల ఇల్లు కూలగొట్టి సామాన్లు బయటపడేయడంతో వర్షంలో తడుస్తూ రేకులు అడ్డం పెట్టుకొని నిరుపేదలు తల దాచుకుంటున్న దృశ్యం మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. హైడ్రా అమా నవీయ చర్యలపై పలురువు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సున్నం చెరువు వద్ద ఒకటి కాదు 100 పైగా కట్టడా లు కూల్చివేతలు జరిగాయి. కనీసం మానవత్వంతో మనుషుల్లా ప్రవర్తించండని హితవు పలుకుతున్నారు. కాగా, మరికొన్ని చోట్ల తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి(Committed suicide) ప్రయత్నించారు.
కనీసం మానవత్వంతో మనుషుల్లా ప్రవర్తించండి
సున్నం చెరువు వద్ద పేదల ఇల్లు కూలగొట్టి సామాన్లు బయటపడేయడంతో వర్షంలో తడుస్తూ రేకులు అడ్డం పెట్టుకొని తల దాచుకున్న నిరుపేదలు.
సున్నం చెరువు వద్ద ఒకటి కాదు 100 పైగా కట్టడాలు కూల్చివేత జరిగింది.
Stop posting such nonsense through the garb… https://t.co/M2A4nECbeK pic.twitter.com/rn6N9xZ0bn
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024