హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ సీట్ల గుర్తింపునకు సంబంధించి ప్రతిపాదనలు పంపొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) కోరింది. ఈ మేరకు గురువారం మెడికల్ కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, డీన్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి వార్షిక నివేదికను తాము కోరినప్పుడు ఎన్ఎంసీ పోర్టల్లో అప్లోడ్ చేయాలని మెడికల్ కాలేజీలకు సూచించింది.