హైదరాబాద్ : హైడ్రా(HYDRAA) పై మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెద్దలను వదిలి పేదలపై ఉక్కపాదం మోపుతుండటం ప్రజలు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం ఇంట్లోని సమాను తీసుకునే సమయం ఇవ్వకుండా ఇండ్లు కూల్చివేస్తుండటంతో పేదలు, మధ్య తరగతి వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. కూల్చివేతలను నిరిసిస్తూ పలుచోట్ల పేదలు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయాన్నికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) కీలక ప్రకటన(Key announcement ) చేశారు. ఆల్రెడీ నివాసం ఉంటున్న గృహాలను కూల్చం. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు స్థలాలు ఇకపై కొనవద్దని హైడ్రా సూచింది. దీంతో ఇక హైడ్రామాకు హైడ్రా చెక్ పెట్టనుందా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
కాగా, నగరంలో మరోసారి హైడ్రా కూల్చి వేతలు మొదలయ్యాయి. మాదాపూర్(Madapur) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలపై పేదలు (Hydra victims)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Committed suicide) ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.