హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మని ఉరికిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై.. అంటున్నదని చెప్పారు. కేసీఆర్ పాలనలో రియల్ భూమ్ ఎలా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. కేవలం పరిపాలన దక్షత లోపం, విజన్ లేని పాలనా విధానంతోనే ఆదాయం పడిపోయిందని చెప్పారు. హైడ్రాతో తెలంగాణ ఆదాయానికి జీవధార అయిన రియల్ రంగంపై వేటు పడిందని, ముందు చూపులేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పడిందన్నారు.
‘పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ
తొమ్మిదిన్నరేళ్లు రియల్ ఎస్టేట్ రంగం రయ్.. రయ్ మని ఉరికింది..
కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై అంటోంది..
కేసీఆర్ పాలనలో రియల్ భూమ్ కొనసాగింది ఎట్ల.. కాంగ్రెస్ పాలనలో ఆగిపోవడం ఎట్ల?
కేవలం పరిపాలన దక్షత లోపం..విజన్ లేని పాలనా విధానం!!
తెలంగాణ ఆదాయానికి జీవధార రియల్ రంగంపై హైడ్రా వేటు
ముందు చూపు లేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ
తొమ్మిదిన్నరేళ్లు రియల్ ఎస్టేట్ రంగం రయ్.. రయ్ మని ఉరికింది..
కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై అంటోంది..
కేసీఆర్ పాలనలో రియల్ భూమ్ కొనసాగింది ఎట్ల.. కాంగ్రెస్ పాలనలో ఆగిపోవడం ఎట్ల?
కేవలం పరిపాలన దక్షత లోపం..విజన్ లేని పాలనా… pic.twitter.com/QWGBGRwqEr
— KTR (@KTRBRS) November 5, 2024